India: ఆసీస్‌తో టెస్టు: మరోసారి ఘోరంగా విఫలమైన బ్యాట్స్‌మెన్.. టీమిండియా స్కోరు 26/8

indian batsmen fail again
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు
  • ఆసీస్ 191 పరుగులు
  • రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ 9, హనుమ విహారీ 7 పరుగులు
  • కనీసం రెండంకెల స్కోరూ చేరని బ్యాట్స్‌మెన్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచులో బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ మ్యాచులో పూర్తిగా బౌలర్ల హవా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 19 ఓవర్ల వద్ద కేవలం 26 పరుగులతో ఏకంగా 8 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

టీమిండియాలో పృథ్వీ షా 4, మయాంక్ 9, బుమ్రా 2, పుజారా 0, విరాట్ కోహ్లీ 4, రహానే 0, వృద్ధిమాన్ సాహా 4, రవి చంద్రన్ అశ్విన్ 0 పరుగులు చేశారు. హనుమ విహారి 7, ఉమేశ్ యాదవ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బ్యాట్స్ మెన్ ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు వరకూ కూడా చేరుకోలేకపోయారు.
India
Australia

More Telugu News