వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు నిజాం చెంచా సీఎం కాబోడు: బీజేపీ నేత తరుణ్ ఛుగ్
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చూపించింది ట్రైలరే
- నిజాం పాలనను అంతమొందించే వరకు నిద్రపోను
- ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో కేసీఆర్ కుటుంబం పోటీ
కొన్ని రాష్ట్రాల్లో తండ్రీ కొడుకులు, మరికొన్ని రాష్ట్రాల్లో తల్లీ కూతుళ్ల పాలనను చూశామని, కానీ తెలంగాణను మాత్రం తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువు (మజ్లిస్)తో కూడిన కుటుంబం పాలిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్తో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయడం మానొద్దని పార్టీ శ్రేణులకు ఛుగ్ పిలుపునిచ్చారు.