Dil Raju: పుట్టినరోజు సందర్భంగా దిల్ రాజు కీలక నిర్ణయం

Dil Raju important decision on his birthday
షార్ట్స్‌లో చూడండి
దిల్ సినిమాతో హిట్ కొట్టి అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సామాజిక సేవలోనూ భాగస్వామినవుతానని వెల్లడించారు. చిత్ర నిర్మాణంతో పాటు సామాజిక సేవల రంగంలోనూ తన కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు.

ఇటీవలే తాను సెకండ్ లైఫ్ ప్రారంభించానని, ఏంచేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ సామాజిక సేవా నిర్ణయం అని తెలిపారు. సమాజానికి ఏదైనా తిరిగివ్వాలన్నదే తన అభిమతమని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ కొత్త కార్యాచరణలో తానొక్కడినే కాదని, సామాజిక సేవపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా తమతో చేయి కలపొచ్చని స్పష్టం చేశారు.

మీడియా దృష్టికి వచ్చే సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తానని వెల్లడించారు. అయితే, విద్య, ఆర్యోగ పరమైన అంశాలకే తన తొలి ప్రాధాన్యత అని దిల్ రాజు వివరించారు.
Go Back to Shorts
Dil Raju
Birthday
Key Decision
Social Service
Tollywood

More Telugu News