Tollywood: దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో అగ్రహీరోల గ్రూప్ ఫొటో ఇదిగో!

  • నేడు దిల్ రాజు జన్మదినం
  • గతరాత్రి ఘనంగా విందు ఏర్పాటు
  • పార్టీకి విచ్చేసిన టాలీవుడ్ ప్రముఖులు
  • ప్రభాస్, మహేశ్, చరణ్, విజయ్ దేవరకొండలతో దిల్ రాజు ఫొటో
  • నెట్టింట్లో సందడి చేస్తున్న గ్రూప్ ఫొటో
Tollywood heroes attends Dil Raju birthday bash

అగ్రశ్రేణి నిర్మాత దిల్ రాజు నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన గతరాత్రి టాలీవుడ్ సినీ ప్రముఖులకు విందు ఏర్పాటు చేయగా, అనేకమంది అగ్రహీరోలు విచ్చేశారు. ఈ హీరోలతో దిల్ రాజ్ తీయించుకున్న గ్రూప్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఎంతో అరుదైన కాంబినేషన్లన్నీ ఈ ఫొటోలో చూడొచ్చు. మధ్యలో దిల్ రాజు ఉండగా, అటూ ఇటూ రామ్ చరణ్, మహేశ్ బాబు నిల్చున్నారు. మహేశ్ పక్కనే ప్రభాస్, అటు రామ్ చరణ్ పక్కన రామ్, విజయ్ దేవరకొండ ఉన్నారు. చివర్లో ప్రభాస్ పక్కన నాగచైతన్య ఉన్నాడు. ఈ ఫొటో అందరు హీరోల అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

More Telugu News