Rajnath Singh: హైదరాబాదుకు చేరుకున్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh reaches Hyderabad
  • దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజ్ నాథ్
  • ట్రైనీ అధికారులతో ముఖాముఖి
  • రేపు ట్రైనీ పైలట్ల పరేడ్ లో పాల్గొననున్న రాజ్ నాథ్
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాదుకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాదులోనే వుంటారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనీ అధికారులతో ఆయన ముఖాముఖి అయ్యారు. రేపు జరగనున్న ట్రైనీ పైలట్ల పరేడ్ లో ఆయన పాల్గొననున్నారు. రేపు సాయంత్రం పహాడీషరీఫ్ లోని ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను పరీక్షిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
Rajnath Singh
BJP
Hyderabad

More Telugu News