Kesineni Nani: జగన్ నిన్న పంచిన కాంట్రాక్టుల వివరాలు ఇవే: కేశినేని నాని

Kesineni Nani posts the details of contracts given to YSRCP leaders by Jagan
  • రూ. 791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించి నాని ట్వీట్
  • పెద్దిరెడ్డి కంపెనీకి రూ. 123.10 కోట్ల కాంట్రాక్ట్ 
  • వైయస్ చుట్టానికి రూ. 228.59 కోట్ల పనులు
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. తన సొంత మనుషులకు వందలాది కోట్ల విలువైన కాంట్రాక్టులను పంచిపెట్టారని ఆరోపించారు. మొత్తం రూ. 791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను తన వాళ్లకు పంచారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా ఎవరెవరికి ఎంత విలువైన కాంట్రాక్టులను ఇచ్చారో వివరాలను వెల్లడించారు.

'ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలు:... PLR (పెద్దిరెడ్డి): 126.10 కోట్లు... NSPR (నర్రెడ్డి ..పులివెందుల, YS చుట్టం): 228.59 కోట్లు. KCVR (సురేష్ రెడ్డి): 128.36 కోట్లు. నితిన్ సాయి కన్ స్ట్రక్షన్స్ (పార్థసారధి YCP): 121.63 కోట్లు. జేఎంసీ కన్ స్ట్రక్షన్స్ (శ్రీనివాసులు చిత్తూర్ YCP MLA): 186.85 కోట్లు' అని సోషల్ మీడియా ద్వారా కేశినేని నాని తెలిపారు.

మరోవైపు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఈ రోడ్డు పనులను చేపట్టనున్నారు.
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP
Road Contracts

More Telugu News