Chandrababu: మీకు భగవంతుడు చిరకాల యశస్సును అందించాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు విషెస్

Chandrababu greets Ram Mohan Naidu on his birthday
  • టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు నేడు
  • పిన్న వయసులోనే సంసద్ రత్న అవార్డు అందుకున్నారని కితాబు
  • మరింత ఉన్నతమైన స్ధానానికి ఎదగాలని ఆకాంక్ష
టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా రామ్మోహన్ నాయుడుకి గ్రీటింగ్స్ చెప్పారు.

'తెలుగుదేశం యువనేత, ఉజ్వ‌ల భవిష్య‌త్తు ఉన్న నాయ‌కుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. అతిపిన్న వయసులో పార్లమెంటు సభ్యునిగా ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డును పొందడం ప్రజాసేవ పట్ల మీకున్న నిబద్ధతకు నిదర్శనమని ఈ సందర్భంగా కొనియాడారు.

 ప్రజల ఆశీర్వాదంతో మీరు రాజకీయంగా మరెంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ఉన్నతమైన రాజకీయ జీవితాన్ని అందుకోవాలని, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, చిరకాల యశస్సును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. రామ్మోహన్ నాయుడుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Chandrababu
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam

More Telugu News