marriage: కొన్ని గంటల్లో పెళ్లి.. ప్రమాదవశాత్తు వధువుకు తీవ్ర గాయాలు.. అయినా పెళ్లి చేసుకున్న వరుడు!

groom ties knot in hospital
  • యూపీలోని ప్రయాగరాజ్ లో ఘటన
  • పెళ్లి రోజునే కూలిన వధువు ఇంటి పైకప్పు
  • వధువు వెన్నెముక, కాళ్లకు గాయాలు
  • ఆసుపత్రిలోనే తాళి కట్టిన వరుడు
కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఆ పెళ్లి ఇంట ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే వధువు ఆర్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.

అయినప్పటికీ, పెద్ద మనసున్న పెళ్లి కొడుకు ఆర్తిని అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆమె గాయాలతో మంచంపై ఉన్నప్పటికీ పెద్దలు పెళ్లి చేశారు. ఆసుపత్రి వైద్యులు కూడా వారి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో చోటు చేసుకుంది.

పెళ్లికొడుకు అవధేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. ఇటువంటి కష్ట సమయంలో పెళ్లి కూతురికి తాను మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అవధేశ్ అన్నాడు. ఈ పరిస్థితి వచ్చినందుకు తాను భయపడ్డానని పెళ్లి కూతురు ఆర్తి చెప్పింది. అయితే, వరుడు తనకు అండగా నిలిచాడని, తాను గాయాలపాలైనా పెళ్లి చేసుకున్నాడని ఆర్తి సంతోషాన్ని వ్యక్తం చేసింది. 
marriage
Uttar Pradesh

More Telugu News