Atchannaidu: నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడండి: అచ్చెన్నాయుడు

Atchannaidu warns YSRCP ministers to hold their toungues
  • వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా?
  • వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • జగన్ ఒక వింత ముఖ్యమంత్రి
పన్నుల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జుట్టు మీద తప్ప మిగిలిన అన్నింటి మీద పన్నులు వేశారని అన్నారు. ఎన్నికలు పెడితే కరోనా వస్తుందని జగన్ చెపుతున్నారని... వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా? అని ప్రశ్నించారు. విజయవాడలో ప్రభుత్వం నిన్న నిర్వహించిన బీసీ సంక్రాంతి సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరైన సంగతి తెలిసిందే.

ఏలూరులో వింత వ్యాధికి కారణమేమిటో కూడా చెప్పలేని అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వైసీపీది అని అచ్చెన్న మండిపడ్డారు. జగన్ ను ఒక వింత ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ప్రభుత్వ తప్పుల చిట్టాను ప్రజలు రాసుకుంటున్నారని.. అవకాశం వచ్చినప్పుడు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. బీసీలకు టీడీపీ ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Atchannaidu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News