Kadapa District: పెన్నానదిలో నిన్న ఏడుగురు తిరుపతి యువకుల గల్లంతు.. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యం

six dead bodies recovered from penna river
  • కడప జిల్లాలోని సిద్దవటం వద్ద పెన్నానదిలో ఘటన
  • గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు
  • ఆరు మృతదేహాల వెలికితీత.. మరొకరి కోసం గాలింపు
కడప జిల్లాలోని సిద్దవటం వద్ద పెన్నానదిలో ఈతకు వెళ్లి నిన్న ఏడుగురు గల్లంతు కావడం కలకలం రేపింది. గల్లంతైన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

గల్లంతైన వారు తిరుపతిలోని కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కోరగుంట నుంచి సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ అనే యువకులు సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు రాగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
Kadapa District
penna

More Telugu News