Pooja Hegde: అలా పిలిపించుకోవడమే ఇష్టమంటున్న పూజ హెగ్డే!

Pooja Hegde on being busy both in Tollywood and Bollywood
  • తెలుగులో అధిక డిమాండ్ వున్న నాయిక 
  • ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు
  • హిందీలో సల్మాన్, రణ్ వీర్ తో చిత్రాలు
  • భారతీయ నటినని అనిపించుకోవడమే ఇష్టమట  
ప్రస్తుతం తెలుగులో ఎక్కువ డిమాండ్ వున్న ఇద్దరు, ముగ్గురు కథానాయికల్లో పూజ  హెగ్డే కూడా వుంది. వరుస విజయాలు వరించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. పారితోషికం బాగా పెంచేసినా కూడా 'ఫర్వాలేదు.. డేట్స్ ఇయ్యి చాలు' అంటున్న నిర్మాతలు కూడా వున్నారు.

ప్రస్తుతం తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'రాధే శ్యామ్' సినిమాలలో నటిస్తున్న పూజ.. మరోపక్క బాలీవుడ్ లో కూడా బిజీగా వుంది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమాలోనూ, రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్కస్' చిత్రంలోనూ పూజ ఇపుడు హీరోయిన్ గా నటిస్తోంది.  ఇలా రెండు భాషల్లోనూ ఒకేసారి బిజీగా ఉండడం పట్ల ఈ బ్యూటీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

'ఒకేసారి ఇలా వివిధ భాషల్లో, రకరకాల ప్రాంతాలలో చేయగలగడం నా అదృష్టం, ఒక మంచి అనుభవం కూడా. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచీ నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అలాగే, చిన్నప్పటి నుంచీ నేను హిందీ సినిమాలు చూస్తూ పెరిగినదానిని. దాంతో వరుసగా హిందీలో కూడా ఛాన్సులు రావడం హ్యాపీగా వుంది. ఇక ఆర్టిస్టులం కాబట్టి, ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. ఎక్కడ మంచి ఆఫర్లు వచ్చినా చేయాలి. నావరకు నేను ఒక భాషా నటిగా అనిపించుకోవడం కంటే, భారతీయ నటిగా పిలిపించుకోవడమే ఇష్టం' అని చెప్పింది పూజ హెగ్డే.
Pooja Hegde
Radhe Shyam
Salman Khan
Ranveer Singh

More Telugu News