ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు: సీపీఐ రామకృష్ణ
- అధికారంలోకి వచ్చాక ప్రజలను జగన్ దారుణంగా మోసం చేశాడు
- ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని సమర్థించాడు
- రాజధానిని మారుస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు
రాజధానిని కాపాడుకోవాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమానికి పోటీగా ధర్నాలు చేయిస్తారా? అని రామకృష్ణ దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడం మీ తరం కాదని అన్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతు నాయకులను కూడా అమరావతి ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా దారుణంగా జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఏ అసెంబ్లీలోనైనా ఇంత అధ్వానంగా చట్టాలు చేస్తారా? అని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా అమరావతి విషయంలో నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు.