Budda Venkanna: అమరావతి భవనాల పైనుంచి దూకాలి... కాళ్లు విరిగి నాలుక బయటకు వస్తే అవి నిజమైన భవనాలు: విజయసాయికి బుద్ధా ఛాలెంజ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా ఓ ఛాలెంజ్ విసిరారు. 'వీసా రెడ్డి... అమరావతి ఉద్యమం ఏడాది అవుతున్న సందర్భంగా నీకు ఒక ఛాలెంజ్' అంటూ ట్వీట్ చేశారు. "అమరావతిని గ్రాఫిక్స్ అంటున్నావు కదా... ఒకవేళ అవి గ్రాఫిక్స్ అయితే ఆ భవనాల పైనుంచి దూకి నీ ఫేక్ బ్యాచ్ కు చూపించు. నీ కాళ్లు విరగకపోతే అవి గ్రాఫిక్స్. నీ కాళ్లు విరిగిపోయి నాలుక బయటకు వస్తే అవి నిజమైన భవనాల కింద లెక్క. మరి దీనికి సిద్ధమేనా?" అంటూ సవాల్ విసిరారు.