Tirupati LS Bypolls: తిరుపతి ఉప ఎన్నిక కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన టీడీపీ

Coordination Committee of TDP for Tirupati Lok Sabha Bypolls
  • సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బీద రవిచంద్రలకు స్థానం
  • ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరిగే అవకాశం
  • పనబాక లక్ష్మిని బరిలోకి దించిన చంద్రబాబు
తిరుపతి ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రానున్న ఫిబ్రవరి లేదా మార్చిలో ఉపఎన్నిక జరగొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా ఉండాలంటూ శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉపఎన్నిక కోసం సమన్వయ కమిటీని హైకమాండ్ ఏర్పాటు చేసింది.

సమన్వయ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బీద రవిచంద్ర, నరసింహ యాదవ్, ఉగ్ర నరసింహారెడ్డి, పనబాక కృష్ణయ్యకు స్థానం కల్పించారు. మరోవైపు ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.
Tirupati LS Bypolls
Coordination Committee
Telugudesam
Chandrababu
Panabaka Lakshmi

More Telugu News