Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ లో భారీ వ్యతిరేకత!

Most of the Pakistanis lost faith in Imrans government
  • ప్రభుత్వం గాడి తప్పిందన్న 77 శాతం మంది
  • ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న 36 శాతం మంది
  • అన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణంగానే ఉందన్న సర్వే
ఒక అద్భుతమైన క్రికెటర్ గా పాకిస్థాన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఇమ్రాన్ ఖాన్... ఆ దేశ ప్రధానిగా మాత్రం ప్రజాభిమానాన్ని కూడగట్టుకోలేకపోతున్నారు. ఇమ్రాన్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిపోయిందని ఆ దేశంలోని 77 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి ఐదుగురిలో నలుగురు పాక్ ప్రభుత్వం పట్ల వ్యతరేక భావంతో ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది.

 ఐపీఎస్ఓఎస్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించిన ఈ సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని 36 శాతం మంది చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగానే ఉందని సర్వేలో తేలింది. నిరుద్యోగం పెను సమస్యగా పరిణమించిందని సర్వే తెలిపింది.
Imran Khan
Survey
Government
Pakistan

More Telugu News