కరోనా ఎఫెక్ట్.. ఏసీ బోగీలవైపు కన్నెత్తి చూడని ప్రయాణికులు!
- సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో ఏసీ బోగీలకు ఆదరణ కరవు
- కరోనాకు తోడు శీతాకాలం కావడంతో నిరాదరణ
- స్లీపర్ క్లాసులకు పెరిగిన డిమాండ్
నిజానికి కరోనాకు ముందు ఏసీ బోగీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇక వెయింటింగ్ లిస్ట్ గురించి చెప్పక్కర్లేదు. కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్, సెకండ్ క్లాస్, ధర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్ 150 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు కరోనాకు తోడు శీతాకాలం కావడంతో వీటికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.
కాచిగూడ-చెన్నై-చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ సహా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్లలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీల్లో ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతం మధ్య ఉందని తెలిపారు.