Kamal Haasan: రజనీకాంత్ పార్టీతో పొత్తు విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదు: కమలహాసన్

Kamal Haasan says yet to be decided about alliance with Rajinikanth party
  • త్వరలో పార్టీ ప్రకటించనున్న రజనీకాంత్
  • పొత్తులు కొన్నిసార్లు విడిపోతాయన్న కమల్  
  • మధురైలో పార్టీ ప్రచార షెడ్యూల్ విడుదల
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని వెల్లడి
  • స్థానం ఇంకా ఖరారు కాలేదని వివరణ
మక్కల్ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన ప్రముఖ నటుడు కమలహాసన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలు ముమ్మరం చేశారు. మధురైలో ఇవాళ పార్టీ ప్రచార షెడ్యూల్ ను విడుదల చేసిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 త్వరలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టనుండగా, ఆ పార్టీతో పొత్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పొత్తులు శాశ్వతం కాదని, కొన్నిసార్లు పొత్తులు విడిపోతాయని, కొన్నిసార్లు కొత్తవి పుట్టుకొస్తాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు భారీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
Kamal Haasan
Rajinikanth
Party
Alliance
Tamilnadu

More Telugu News