వల్లభనేని వంశీని విమర్శిస్తూ.. ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ నేత!
- పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన జోజిబాబు
- దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకుంటున్నారని మండిపాటు
- పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంశీపై జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ నాశనం చేస్తున్నారని... వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.