gas: 15 రోజుల వ్యవధిలో రెండోసారి వంట గ్యాస్ ధర పెంపు

gas cylinder price hike
  • రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంపు
  • ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన
  • ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్ ధర రూ.694
దేశంలో మరోసారి వంట గ్యాస్ రాయితీ సిలిండర్ ధర పెరిగింది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర ఇంతవరకు ముందు రూ.644గా ఉంది. ఇప్పుడు పెంచిన ధరలతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్ ధర రూ.694కు చేరింది. దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా స్వల్ప తేడాలతో ధర పెరుగుతుంది. 

 
gas
India

More Telugu News