Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases decresed in AP
  • 24 గంటల్లో కొత్తగా 305 కేసుల నమోదు
  • నెల్లూరు జిల్లాలో ఇద్దరి మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 4,728 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 305 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 45, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,935 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. మరోవైపు కరోనా వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరిద్దరూ నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడం గమనార్హం. మరోవైపు గత 24 గంటల్లో 541 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 8,75,836 మంది కరోనా బారిన పడ్డారు. 7,059 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,64,049 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,728 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Updates