కరోనాతో బాధపడుతున్న హర్యానా మంత్రి అనిల్ విజ్.. మెరుగైన వైద్యం కోసం రోహ్తక్ కు తరలింపు
- మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న మంత్రి
- ఆ తర్వాత సోకినట్టు నిర్ధారణ
- ఆరోగ్యం స్థిరంగా ఉందన్న వైద్యులు
కొవాగ్జిన్ టీకా మూడోదశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి గత నెలలో తొలి షాట్ తీసుకున్నారు. అయితే, ఆయన తీసుకున్నది ప్లాసిబోనా, లేక టీకానా అన్న విషయంలో స్పష్టత లేదు. తొలి డోస్ తీసుకున్న 14 రోజులకు మంత్రి రెండో టీకా తీసుకోవాల్సి ఉండగా అంతలోనే ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
దీంతో ఆయనను అంబాలా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాస్త అసౌకర్యంగా ఉన్నట్టు చెప్పడంతో తాజాగా రోహ్తక్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. రెమ్‌డెసివిర్‌తోపాటు ప్లాస్మా థెరపీ చేయాలని వైద్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాాగా, 67 ఏళ్ల అనిల్ విజ్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన తొడ ఎముకకు శస్త్రచికిత్స జరిగింది.