సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బయోపిక్ కి టైటిల్ పెట్టుకున్న శ్రుతిహాసన్!
- చైతూ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు
- ఫైట్ తో 'ఫైటర్' తాజా షెడ్యూలు షూటింగ్
- 'కోతికొమ్మచ్చి' టాకీ పార్ట్ పూర్తి
* అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆమధ్య హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది. ఇక ఇందులో చైతూ సరసన మొత్తం ముగ్గురు కథానాయికలు నటిస్తారట. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది.
* విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెల 26 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ముందుగా ఒక ఫైట్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
* 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'కోతికొమ్మచ్చి' చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. అమలాపురం, విశాఖ, హైదరాబాదులలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఇందులో సమీర్ వేగేశ్న, మేఘాంశ్ శ్రీహరి హీరోలుగా నటిస్తున్నారు.