Nara Lokesh: మూడు రాజధానుల టెంట్ కింద పట్టుమని మూడు రోజులు కూడా జనాలు లేరు: నారా లోకేశ్

Nara Lokesh comments on CM Jagan over Amaravati movement
  • అమరావతి ఉద్యమం నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు
  • జగన్ మూడు ముక్కలాట టెంట్ వేశారని వెల్లడి 
  • అమరావతి ఉద్యమం మాత్రం ఆగలేదని స్పష్టీకరణ
  • ఉద్యమానికి ఏడాది అంటూ ట్వీట్
  • సంఘీభావంగా ప్రజలు తరలివస్తున్నారని వివరణ
అమరావతి ఉద్యమం నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. రైతులను అవమానించడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా అమరావతిలో జగన్ మూడు ముక్కలాట టెంట్ వేశారని విమర్శించారు. మూడు రాజధానుల టెంట్ కింద పట్టుమని మూడు రోజులు కూడా జనాలు లేరని వ్యాఖ్యానించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో మొదలైన జై అమరావతి ఉద్యమం మాత్రం దేశంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమాల జాబితాలో చేరిందని లోకేశ్ తెలిపారు.

లాఠీదెబ్బలు, రైతుల చేతులకు బేడీలు, అక్రమ కేసులు... ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆత్మగౌరవం కోసం రైతన్న పోరాటం ఉద్ధృతమవుతూనే ఉందని ఉద్ఘాటించారు. జై అమరావతి ఉద్యమం మొదలై ఏడాది కావొస్తున్న సందర్భంగా సంఘీభావంగా కదిలిన ప్రజల్ని చూస్తే మూడు ముక్కలాట మూర్ఖుడు జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh
Jagan
Amaravati Movement
AP Capital
Farmers
Andhra Pradesh

More Telugu News