Shikha Malhotra: కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన బాలీవుడ్ యువనటి

Bollywood actress Shikha Malhotra hospitalised with paralysis
  • ఆసుపత్రి పాలైన శిఖా మల్హోత్రా
  • శిఖా కుడివైపు భాగం పనిచేయడంలేదన్న మేనేజర్
  • నర్సింగ్ కోర్సు చేసిన శిఖా
  • లాక్ డౌన్ సమయంలో నర్సుగా స్వచ్ఛంద సేవలు
  • గత అక్టోబరులో కరోనా బారిన పడిన శిఖా 
బాలీవుడ్ యువ తార శిఖా మల్హోత్రా ఇటీవల కరోనా నుంచి కోలుకుని అంతలోనే పక్షవాతానికి గురైంది. శిఖా పక్షవాతంతో బాధపడుతోందని, ఆమె కుడివైపు భాగం అచేతనంగా మారిందని ఆమె మేనేజర్ అశ్వని శుక్లా తెలిపారు. సరిగా మాట్లాడలేకపోతున్నారని వివరించారు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఫ్యాన్' చిత్రం ద్వారా శిఖా మల్హోత్రా గుర్తింపు తెచ్చుకున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఆమె సామాజిక స్ఫూర్తిని చాటుతూ ఓ నర్సుగా మారి కరోనా రోగులకు సేవలందించారు. శిఖా సినిమాల్లోకి రాకముందు నర్సింగ్ విద్య అభ్యసించారు. తన విద్యకు సార్థకత చేకూర్చుతూ లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛంద సేవలందించారు. ఈ క్రమంలో ఆమె కూడా గత అక్టోబరులో కరోనా బారినపడ్డారు.  కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా పక్షవాతానికి గురికావడంతో శిఖాను కుటుంబ సభ్యులు ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
Shikha Malhotra
Paralasis
Corona Virus
Mumbai
Bollywood

More Telugu News