కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు రహదారుల దిగ్బంధం
- నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతుల ఆందోళన
- నేటితో 17వ రోజుకు చేరుకున్న ఉద్యమం
- ఢిల్లీ సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు
మరోవైపు, రైతుల ఆందోళనకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. రైతుల హెచ్చరిక నేపథ్యంలో టోల్‌గేట్ల వద్ద, ఢిల్లీ శివారులోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అలాగే, పలు రహదారులను మూసివేశారు. రైతుల ఆందోళనకు తొలి నుంచి అండగా నిలుస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ నెల 14న పంజాబ్‌లో వేర్వేరుగా ఆందోళనలు చేపట్టనున్నాయి.