Rajanikant: రజనీకాంత్ సినిమాలంటే ఇష్టమే.. పొత్తు మాత్రం కష్టం!: కరుణానిధి తనయుడు అళగిరి

Will Act with Rajani if a Chance but No Politics says Azhagiri
  • ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోను
  • రజనీతో సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఓకే
  • ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్న అళగిరి
రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని గత వారంలో దక్షిణాది సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్ చేసిన ప్రకటనపై కరుణానిధి కుమారుడు, కొత్త పార్టీని ప్రారంభించే సన్నాహాల్లో ఉన్న అళగిరి స్పందించారు. సినిమాల వరకూ రజనీకాంత్ అంటే తనకెంతో అభిమానమని తెలిపిన ఆయన, రజనీతో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని, ఇదే సమయంలో రాజకీయాల్లో పొత్తు మాత్రం పెట్టుకునే అవకాశాలు లేవని, ఏ ఇతర పార్టీతో పొత్తు లేకుండానే తన పార్టీ బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

చెన్నైలో తన సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన, తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తను కీలకమవుతానని చెప్పిన ఆయన, రజనీకాంత్ కు ఇప్పటికే తాను అభినందనలు తెలిపానని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈలోగా తన మద్దతుదారులతో సమావేశమై, వారి అభిప్రాయాలు తీసుకున్న తరువాత తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
Rajanikant
Azhagiri
Tamilnadu
Movies

More Telugu News