బీజేపీకి కేటాయించిన కమలం గుర్తును ఉపసంహరించుకోవాలంటూ పిల్
- గుర్తులను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయండి
- కమలం గుర్తుతో ఆ పార్టీకి అయాచిత లబ్ధి
- స్వతంత్ర అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్న పిటిషనర్
- వచ్చే నెల 12కు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం
దీంతో ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ పార్టీలకు కేటాయించే గుర్తులను ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని కోరారు. గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈసీని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాధుర్, జస్టిస్ పీయూష్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం.. పిల్‌పై తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అలాగే, ఇతర రాజకీయ పార్టీలను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలంటూ కాళీ శంకర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. పిల్‌పై తమ స్పందనను తెలియజేసేందుకు సమయం ఇవ్వాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.