మీ వద్ద ఆ సమాచారం ఉన్నట్టయితే వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి: కేంద్రానికి శివసేన సలహా
- రైతుల ఆందోళన వెనుక చైనా, పాక్ ఉందన్న కేంద్ర మంత్రి
- ఇది చాలా సీరియస్ విషయమన్న సంజయ్ రౌత్
- రాష్ట్రపతి, ప్రధాని చర్చించాలని వ్యాఖ్య
ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... అదే నిజమైతే చైనా, పాకిస్థాన్ లపై వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఆ దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టైతే... ఆ దేశాలపై రక్షణ మంత్రి వెంటనే సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమని... రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే దీనిపై చర్చించాలని అన్నారు.