Pakistan: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం.. కాల్పులు జరిపిన భారత్

pak drone enters in ranbir sector
  • జమ్మూ కశ్మీర్‌లోని రణబీర్‌ సింగ్ పురా సెక్టార్‌ వద్ద ఘటన
  • పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతోన్న సరిహద్దు భద్రతా దళాలు
  • పదే పదే డ్రోన్లతో పాక్ దుందుడుకు చర్యలు
పాకిస్థాన్ తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని రణబీర్‌ సింగ్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌కు చెందిన డ్రోన్‌ కలకలం రేపింది. డ్రోన్ల సాయంతో భారత సరిహద్దుల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకు పాక్ చేస్తోన్న ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి.

తాజాగా, ఓ డ్రోన్ కనపడడంతో వెంటనే అప్రత్తమైన బీఎస్ఎఫ్ కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ తిరిగి అక్కడి నుంచి పాక్‌లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. పాక్ పదే పదే ఈ చర్యలకు పాల్పడుతోందని, గత నెల 21న మెన్దార్‌ సెక్టార్‌లోనూ డ్రోన్ కదలికలను గుర్తించి, దీటుగా సమాధానం చెప్పామని తెలిపారు. అంతకుముందు సెప్టెంబరులోనూ సాంబా సెక్టార్‌ వద్ద రెండు పాక్ డ్రోన్లు తిరుగుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు.
Pakistan
Drone
Jammu And Kashmir

More Telugu News