Telangana: చలి పులి పంజా... తెలంగాణలో ఈ సీజన్ లో తొలిసారి 7.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!

Cold Wave in Telangana
  • ఆసిఫాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత
  • పగటి సగటు అధికం, రాత్రి పడిపోతున్న ఉష్ణోగ్రత
  • కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధిక వేడి
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సీజన్ లోనే అతి తక్కువగా 7.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా తక్కువకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

 సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే, నమోదవుతున్న ఉష్ణోగ్రతలలో చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. కనిష్ఠ సగటు కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా, గరిష్ఠ ఉష్ణోగ్రత కన్నా 3.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఒక్క నల్గొండ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పగటి వేడిమి అధికంగా ఉందని తెలిపారు.
Telangana
Cold
Kumaram Bheem Asifabad District
Sangareddy District

More Telugu News