నేడు సిద్దిపేటకు కేసీఆర్.. రూ.870 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- 144 మంది డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు
- సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
- వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
- భారీ బహిరంగ సభ
అలాగే, పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. మెడికల్ కళాశాల, రంగనాయకసాగర్ అతిథిగృహం, సిద్దిపేటలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, రైతు వేదికలను ప్రారంభిస్తారు. వెయ్యి పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.