JP Nadda: మమతా బెనర్జీ పాలనలో అన్నీ అరాచకాలే: జేపీ నడ్డా

Mamatas rule is filled with atrocities says JP Nadda
  • మమత అంటేనే అసహనం అనే విధంగా పాలన సాగుతోంది
  • బెంగాల్ లో ఘన విజయం సాధిస్తాం
  • టీఎంసీ అనేది ఒక కుటుంబ పార్టీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుని బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మమతాబెనర్జీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ది కంటే అరాచకాలే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. మమత అంటేనే అసహనం అనే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు.

బీజేపీకి, బెంగాల్ కు ఎంతో అవినాభావ సంబంధం ఉందని... ఇద్దరు బీజేపీ జాతీయ అధ్యక్షులను అందించిన ఘనత బెంగాల్ దని చెప్పారు. ఈరోజు కోల్ కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో ఆయన పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎంసీపై మండిపడ్డారు. టీఎంసీ కుటుంబ పార్టీ అని, ఇందులో కేవలం నాయకుల వారసులే రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు.
JP Nadda
BJP
Mamata Banerjee
TMC
West Bengal

More Telugu News