సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ
- 'రాధే శ్యామ్' తాజా షెడ్యూల్ పూర్తి
- విజయ్ దేవరకొండ కొత్త సినిమా
* ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ముగిసింది. గత నెల రోజులుగా హైదరాబాదులో జరిగిన ఈ షెడ్యూలులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
* ప్రస్తుతం నాని హీరోగా 'టక్ జగదీశ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.