Virat Kohli: చివరి టీ20లో ఓడిపోవడానికి కారణం ఇదే: కోహ్లీ

Didnt played well in middle overs says Virat Kohli
  • చివరి టీ20లో ఓటమిపాలైన భారత్
  • 12 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా
  • మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామన్న కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. వరుసగా రెండు టీ20లను కైవసం చేసుకున్న భారత్ చివరి వన్టేలో ఓడిపోయింది. ఓటమిపై కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాడు. ఇండియా ఓడిపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు.

ఈరోజు జరిగిన టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ గెలుపొందింది. తద్వారా భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకుంది.
Virat Kohli
Team India

More Telugu News