Hyderabad: హైదరాబాదులో జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

Car crashed into Jilebi shop in Hyderabad
  • శంషాబాద్ లో చోటు చేసుకున్న ప్రమాదం
  • గాయపడ్డ నలుగురు వ్యక్తులు
  • బ్రేక్ ఫెయిల్ వల్లే ప్రమాదమని చెప్పిన డ్రైవింగ్ చేసిన మహిళ
హైదరాబాదులోని శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం సంభవించింది. అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న జిలేబీ తయారీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ కారును ఓ మహిళ డ్రైవ్ చేయడం గమనార్హం. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేడి నూనె మీద పడి వారు గాయపడ్డారు.

అప్పటి వరకు అక్కడ ప్రశాంతంగా ఉన్నవారు ఈ ఘటనతో ఉలిక్కి పడ్డారు. దుకాణం వైపు కారు దూసుకొస్తుండటాన్ని గమనించిన వారు పక్కకు పరుగులు తీశారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవింగ్ చేసిన మహిళ తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆమె లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Road Accident
Women

More Telugu News