Niharika Konidela: పెళ్లికూతురు నిహారికను భుజాలపై ఎత్తుకున్న వరుణ్ తేజ్.. ‘చిరు’ పాటకి వధూవరుల డ్యాన్స్.. వీడియోలు వైరల్

VarunTej at Wedding event and dance
  • రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి వేడుక
  • నిన్న రాత్రి సంగీత్
  • ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా’ పాటకు వధూవరుల డ్యాన్స్‌
సినీనటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లి సందడి చేస్తోంది. నిన్న రాత్రి సంగీత్ నిర్వహించగా అందులో మెగా ఫ్యామిలీ సభ్యులు హుషారుగా గడిపారు. తన చెల్లి నిహారికను వరుణ్ తేజ్ భుజాలపై ఎత్తుకున్నాడు.

  మెగాస్టార్ చిరంజీవి సినిమా 'బావగారూ బాగున్నారా'లోని ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా’ పాటకు పెళ్లి కూతురు, పెళ్లికొడుకు నిహారిక, చైతన్యలతో కలిసి డ్యాన్స్‌ చేశారు. మరిన్ని పాటలకు కూడా వధూవరులు డ్యాన్స్ చేశారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీలోని చిన్నారులు కూడా డ్యాన్సులు చేసి అదరగొట్టేశారు.

ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనపడ్డారు. రేపు రాత్రి నిహారిక మెడలో చైతన్య తాళి కట్టనున్నాడు. అనంతరం హైదరాబాద్ లో వివాహ విందు ఉంటుంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు, ప్రముఖులను ఆహ్వానించారు.
Niharika Konidela
Tollywood
marriage

More Telugu News