Hyderabad: బీజేపీ నాయకుడిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడి దాడి

TRS corporator son attacked on BJP leader in Hyderabad
  • తప్పతాగి ఇంటికెళ్లి గొడవ.. ప్రశ్నించినందుకు దాడి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు
  • రాజకీయ కక్షతోనే దాడి జరిగిందని ఆరోపణ
బీజేపీ నాయకుడిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బీజేపీ నాయకుడు కె. శంకర్ ఇంటికి స్నేహితులతో కలిసి వెళ్లిన టీఆర్ఎస్ కార్పొరేటర్ కుర్మ హేమలత కుమారుడు సాయి నిఖిల్ ఇంటి తలుపును తన్నుతూ నానా హంగామా చేశాడు.

ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి బయటకు వచ్చిన శంకర్‌ను దూషిస్తూ దాడిచేశారు. దీంతో శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ కుమారుడు తప్పతాగి వచ్చి తనపై దాడిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై దాడిచేశాడని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
TRS
BJP
Attack
Police

More Telugu News