జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే: మమతా బెనర్జీ
- కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి
- లేకపోతే అధికారం నుంచి వైదొలగాలి
- బీజేపీ అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా
రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉండే హక్కు లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని... జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు టీఆర్ఎస్ సహా పలు పార్టీలు మద్దతు పలికాయి.