Niharika: విమానంలో పెళ్లికూతురు నిహారికతో పెళ్లికొడుకు సెల్ఫీ!

Varun Tej  Niharika Konidela off to Udaipur along with their family
  • మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుక 
  • రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి
  • ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్‌కు పెళ్లి బ‌ృందం
మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుక జరుగుతోన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్‌లో జరగనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్నారు. నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ రోజు నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ బయలుదేరారు.

ఈ సందర్భంగా పెళ్లికొడుకు సెల్ఫీ తీశాడు. ఇందులో నాగబాబు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో విందు ఉంటుంది.
Niharika
nagababu
Varun Tej

More Telugu News