వీడియో సెల్ఫీ తీసుకుంటూ తనువు చాలించిన మహిళ... హైదరాబాదులో ఘటన

Woman commits suicide in Lalapet
  • లాలాపేటలో గృహిణి ఆత్మహత్య
  • కొడుకులు చూస్తుండగానే ఉరేసుకున్న వైనం
  • అమ్మకోసం విలపిస్తున్న చిన్నారులు
  • చూపరులను కంటతడిపెట్టిస్తున్న వైనం
హైదరాబాదులోని లాలాపేటలో మంజుల అనే మహిళ వీడియో సెల్ఫీ తీసుకుంటూ బలవన్మరణం చెందిన ఘటన అందరినీ కలచివేసింది. ఏ కష్టమొచ్చిందో కానీ కన్నబిడ్డలు చూస్తుండగానే ఉరి వేసుకుని చనిపోయింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.

లాలాపేటలో నివసించే మంజులకు పన్నెండేళ్ల కిందట పెళ్లయింది. ఆమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్ లో బేకరీ నిర్వహిస్తుంటాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే శనివారం నాడు మంజుల తన బిడ్డలు చూస్తుండగానే ఉరేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రంజిత్, తేజస్ బేకరీలో ఉన్న తమ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.

కానీ భర్త వచ్చేసరికి మంజుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.  

Go Back to Shorts
Woman
Suicide
Video Selfie
Lalapet
Hyderabad

More Telugu News