UNO: రైతుల ఆందోళనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

  • శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు ప్రజలకు ఉంది
  • ప్రదర్శనలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి
  • బ్రిటన్ ఎగువ సభలోనూ రైతు ఆందోళనపై చర్చ
UNO Responds over Farmers protest in Delhi

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు రైతులకు ఉందని, వారి ఉద్యమానికి అడ్డు తగలొద్దని కోరింది. శాంతియుత ప్రదర్శనలు చేసుకునేలా ప్రభుత్వం వారికి అవకాశం కల్పించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టిఫేనే జూరిక్ పేర్కొన్నారు.

మరోవైపు, భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనపై బ్రిటన్ ఎగువ సభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లోనూ ప్రస్తావనకు వచ్చింది. రైతుల ఆందోళన గురించి లార్డ్ ఇంద్రజిత్ సింగ్ లేవనెత్తగా, కేబినెట్ ఆఫీసు మంత్రి లార్డ్ నికోలస్ ట్రూ సమాధానం ఇచ్చారు. ఇతర దేశాల వ్యవహారాలను ఖండించలేమని స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడలంటూ తమ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌కు వినతిపత్రం అందించారు.

More Telugu News