Raghu Rama Krishna Raju: నాకు బైపాస్ సర్జరీ జరిగింది... త్వరలోనే మీ ముందుకు వస్తా; రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju says his bypass surgery went well
  • గత కొన్నిరోజులుగా మీడియాలో కనిపించని రఘురామ
  • తనకు శస్త్రచికిత్స జరిగిందంటూ ట్వీట్
  • ప్రస్తుతం కోలుకుంటున్నానని వెల్లడి
ఢిల్లీలో  'రచ్చబండ' కార్యక్రమాలతో నిత్యం సందడి చేసే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొన్నిరోజులుగా మీడియాలో కనపడడంలేదు. దీనిపై ఎలాంటి సమాచారం కూడా లేదు. అయితే, తన పరిస్థితిపై రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు. హృదయ సంబంధ సమస్యతో బాధపడుతున్న తనకు వైద్యులు బైపాస్ సర్జరీ చేశారని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు, శ్రేయోభిలాషుల దీవెనలతో  శస్త్రచికిత్స దిగ్విజయం అయిందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని వివరించారు. త్వరలోనే ప్రజాజీవితంలోకి వస్తానని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు అంటూ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.
Raghu Rama Krishna Raju
Bypass Surgery
MP
Narasapuram
YSRCP

More Telugu News