కొడుకు వల్ల ఊహించని విధంగా ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థిని!
- 32 ఓట్లతో ఓడిపోయిన లక్ష్మీప్రసన్నగౌడ్
- డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె కుమారుడు రంజిత్
- రంజిత్ కు పోలైన 39 ఓట్లు
తొలుత 1206 ఓట్ల ఆధిక్యతతో కొనసాగిన లక్ష్మీప్రసన్న చివరకు ఓటమి పాలయ్యారు. 32 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి ఆమె కుమారుడే కారణమయ్యాడు. ఆమె కుమారుడు రంజిత్ గౌడ్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఆయనకు 39 ఓట్లు వచ్చాయి. నామినేషన్ ను ఆయన ఉపసంహరించుకుని ఉంటే... ఆ ఓట్లు టీఆర్ఎస్ కు పడేవి. దీంతో, లక్ష్మీప్రసన్న గెలిచేది. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో.