కరోనా టీకా బుకింగ్‌లో భారత్ అగ్రస్థానం.. 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీల ఆర్డర్
- ప్రపంచ దేశాలకు మించి టీకా డోసులను బుక్ చేసిన భారత్
- 500 మిలియన్ డోసుల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా బుకింగ్
- డ్యూక్ యూనివర్సిటీ గణాంకాల్లో వెల్లడి
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా టీకాను మిగతా దేశాలకంటే ఎక్కువగా భారత్ బుక్ చేసుకున్నట్టు ఆ గణాంకాలు వెల్లడించాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను 500 మిలియన్ డోసులను భారత్ బుక్ చేసింది. అమెరికా కూడా దాదాపు ఇంతే స్థాయిలో బుక్ చేసింది. ఆస్ట్రాజెనెకా టీకాపై ఆసక్తి చూపుతున్న యూరప్ దేశాలు కూడా ఈ టీకాను భారీస్థాయిలో బుక్ చేసినట్టు తెలుస్తోంది.