Nara Lokesh: రాజకీయ కక్షసాధింపు తప్ప జగన్ సాధించింది శూన్యం: నారా లోకేశ్

lokesh slams ap govt
షార్ట్స్‌లో చూడండి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమీపంలో టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘రాజకీయ కక్షసాధింపు తప్ప వైఎస్ జగన్ సాధించింది శూన్యం. టీడీపీ హయాంలో గ్రామాల అభివృద్ధి కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారికి చెల్లించాల్సిన రూ.2500 కోట్ల బిల్లులు ఆపి ప్రభుత్వం వేధిస్తోంది’ అని లోకేశ్ చెప్పారు.

‘తక్షణమే పెండింగ్ పెట్టిన ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం’ అని లోకేశ్ పేర్కొన్నారు. 
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News