Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Pooja Hegde reduces her fee for Swapna Duth film
  • ఫీజు తగ్గించుకున్న పూజ హెగ్డే 
  • 'ఆచార్య' షూటింగులో చిరంజీవి
  • 'పుష్ప' కోసం బన్నీపై సాంగ్ షూట్     
*  చిన్న బడ్జెట్ చిత్రాల విషయంలో కథానాయిక పూజ హెగ్డే తన పారితోషికాన్ని తగ్గించుకుంటోందట. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు 2.5 కోట్ల వరకు తీసుకుంటున్న పూజ.. తాజాగా దుల్ఖర్ సల్మాన్ హీరోగా స్వప్నదత్ నిర్మించే చిత్రానికి బాగా తగ్గించుకుని సహకరిస్తున్నట్టు ఫిలింనగర్ వార్త.
*  మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'ఆచార్య' షూటింగులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ వారాంతం వరకు ఈ చిత్రం షూటింగులోనే ఆయన పాల్గొంటారు.
*  అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగ్ ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. అక్కడ బన్నీపై ఒక పాటను, ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. కాగా, యూనిట్ లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడంతా ఐసోలేషన్ లో వున్నారు.
Pooja Hegde
Dulkhar
Chiranjeevi
Allu Arjun

More Telugu News