Janasena: నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న పవన్ కల్యాణ్

jana sena chief pawan kalyan today visits chittor and nellore districts
  • ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరనున్న పవన్
  • పోయ గ్రామంలో తుపాను బాధిత రైతులను కలుసుకుని పరామర్శ
  • అనంతరం నెల్లూరు జిల్లాకు జనసేనాని
నివర్ తుపాను బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని నేటి ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి పోయ గ్రామంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుంటారు.

అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తారు. 11 గంటలకు నాయుడుపేట చేరుకుంటారు. అక్కడ రైతులను కలుసుకుని పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు.
Janasena
Pawan Kalyan
Andhra Pradesh
Nellore District
Chittoor District
Nivar cyclone

More Telugu News