రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... స్వాగతం పలికిన ముఖ్యనేతలు
- చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటనకు వచ్చిన పవన్
- ఈ సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం
- అనంతరం కార్యకర్తలతో భేటీ
ఈ నేపథ్యంలో రేణిగుంట వచ్చిన ఆయన కరకంబాడి మీదుగా తిరుపతి బయల్దేరారు. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 5 గంటలకు జనసేన కార్యకర్తల భేటీలో పొల్గొంటారు. ఇటీవల నివర్ తుపానుతో ఏపీలోని అత్యధిక జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకోవాలని పవన్ రంగంలోకి దిగారు.