Ram Gopal Varma: 'కరోనా వైరస్' సినిమా ట్రైలర్-2 విడుదల

Coronavirus Official Trailer 2  Ram Gopal Varma
  • లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా అన్న వర్మ
  • కరోనా భయంతో ఓ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులను చూపిన ఆర్జీవీ
  • కుటుంబంపై  కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్న కథతో సినిమా
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ సినిమా ట్రైలర్ ను ఆయన విడుదల చేశారు. తాజాగా, ఆయన ఈ సినిమా నుంచి ట్రైలర్-2ను విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఓ కుటుంబ సభ్యులు ఎలా భయపడిపోతున్నారో ఇందులో చూపించారు.

ఆ కుటుంబంపై  కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్నది ఇందులో చూపించారు. ఇంట్లో ఓ వ్యక్తి దగ్గుతుండడం, కరోనా వచ్చిందేమోనని ఇంట్లోని ఇతరులు భయపడుతుండడం, లాక్‌డౌన్‌లో ఇంట్లోనే కూర్చుంటూ అందరూ అసహనానికి గురవడం వంటి సీన్లను ఆయన ఇందులో చూపించారు. సినిమాలో కుటుంబ పెద్ద ఇంట్లో వారెవ్వరినీ ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకపోవడం వంటి సీన్లను ఇందులో చూడొచ్చు.

అయినప్పటికీ ఓ వ్యక్తి మెల్లిగా తలుపు తీసుకుని బయటకు వెళ్లడం వంటి సీన్లను ఇందులో చూపించారు. త్వరలో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్ తర్వాత విడుదల కానున్న మొదటి సినిమా ఇదేనంటూ వర్మ పేర్కొన్నారు.
   
Ram Gopal Varma
RGV
Tollywood
Trailer

More Telugu News