Udit Narayan: ప్రేయసి శ్వేతా అగర్వాల్ ను పెళ్లాడిన ఉదిత్ నారాయణ్ కుమారుడు!

Aditya Narayan Marriages Actress Swetha
  • పదేళ్లుగా శ్వేతతో ప్రేమాయణం
  • పెద్దలు అంగీకరించడంతో నిన్న వివాహం
  • ముంబై ఇస్కాన్ టెంపుల్ లో ఒకటైన జంట
తాను ప్రేమించిన నటి శ్వేతా అగర్వాల్ ను పెళ్లాడటం ద్వారా ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ ఓ ఇంటి వాడయ్యాడు. ముంబైలోని ఇస్కాన్ శ్రీకృష్ణ దేవాలయంలో వీరిద్దరి వివాహం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మంగళవారం నాడు వైభవంగా జరిగింది. ఈ పెళ్లి చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాల పాటు శ్వేతతో చేసిన స్నేహం, తరువాత ప్రేమగా మారగా, వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించారు.

ఇక పెళ్లికి ముహూర్తం సిద్ధం కాగా, ఆదిత్యతో కలిసి అతని తల్లి దీపా నారాయణ్ బారాత్ లో చేసిన సందడికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. తండ్రిలాగే గాయకుడిగానూ సినీ అభిమానులకు పరిచితమైన ఆదిత్య, టీవీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. శ్వేతతో కలిసి 'షాపిత్' అనే చిత్రంలో నటించి, నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ, చివరకు ఏడడుగుల బంధం దిశగా దారితీయడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు శుభాభినందనలు తెలుపుతున్నారు.
Udit Narayan
Aditya Narayan
Swetha Agarwal
Marriage

More Telugu News